Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నూతన క్రీడా విధానం రూపకల్పనపై రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఆ శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజుతో కలిసి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో క్రీడల అభివృద్ధి, క్రీడాకారులకు ప్రోత్సాహం, కోచ్‌ల సంక్షేమం, క్రీడా మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై చర్చించారు. వచ్చే క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం నాటికి ముసాయిదా బిల్లును రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. క్రీడారంగ మేధావులు, అసోసియేన్ ప్రతినిధులు, ఒలింపియన్లు, అంతర్జాతీయ క్రీడాకారులను, సంప్రదించి వారి సలహాలను, సూచనలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో క్రీడలశాఖ సంయుక్త కార్యదర్శి కె.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
వేణుగోపాల్‌కు ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డ్
ప్రముఖ సంస్థ స్కోచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డును సెట్విన్ సంస్థ ఎండీ వేణుగోపాల్‌కు మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. నిరుద్యోగ యువతకు విరివిగా ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు ఈ అవార్డు అందజేసినట్టు ఆయన తెలిపారు. సెట్విన్ సంస్థకు ఈ అవార్డు రావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.