Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్
- అదేరోజు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నిరసనలు, దిష్టిబొమ్మ దహనాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం (డిసెంబర్ 2న) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించను న్నట్టు పలు కార్మిక సంఘాలు ప్రకటించాయి. బుధవారంనా డిక్కడి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బాలరాజు, హెచ్ఎమ్ఎస్ ప్రధాన కార్యదర్శి రెబ్బా రామారావు, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు ఎమ్బీ విజయకుమా ర్, ఐఎఫ్టీయూ కార్యదర్శి ఎమ్ శ్రీనివాస్, ఏఐయూటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ బాబురావు, ఐఎఫ్టీయూ అధ్యక్షులు ఆరెళ్ల కృష్ణ, ఐఎఫ్టీయూ ఉపాధ్యక్షురాలు అరుణ, ఐఎఫ్‌టీ యూ రాష్ట్ర కమిటీ సభ్యులు వీ ప్రవీణ్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బీ మధు, రాష్ట్ర కమిటీ సభ్యులు సోమన్న మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు అమల్లో భాగంగా డిసెంబర్ 2న రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తు న్నట్టు చెప్పారు. కేంద్రప్రభు త్వం నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించుకో వాలనీ, కార్పొరేట్ అనుకూల విధానాలు విడనాడాలనీ, ప్రభుత్వరంగ సంస్థల్ని కాపాడాలనే పలు డిమాండ్లతో ఈ ఆందోళనలు నిర్వహిస్తు న్నామన్నారు. రాష్ట్ర కేంద్ర ఆందోళనల్లో భాగంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో డిసెంబర్ 2న అన్ని కార్మిక సంఘాల సంయుక్తాధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లోనూ సంయుక్త కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతారని వివరించారు. ఈ ఆందోళనల్లో ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.