Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వీఐటీ ఏపి స్కూల్ ఆఫ్ లా (వీఎస్ఎల్), వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయం, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బర్మింగ్ హామ్ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. గురువారం వీఐటీ ఏపీ వర్సిటీ వీసీ డాక్టర్ ఎస్వీ కోటారెడ్డి, బర్మింగ్ హామ్ విశ్వవిద్యాలయ గ్లోబల్ ఎంగేజ్మెంట్ హెడ్ ప్రొఫెసర్ పాల్ మెక్ కానెల్ ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా కోటారెడ్డి మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా వర్సిటీలోని వీఐటీ ఏపీ స్కూల్ ఆఫ్ లా, ఇతర విభాగాల విద్యార్థుల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. గ్లోబల్ స్కూల్‌గా మార్చేందుకు, విద్యార్థులను అంతర్జాతీయంగా నిపుణులుగా తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందని చెప్పారు. అంతర్జాతీయ చట్టం, మానవ హక్కులు, వ్యాపారం, వాణిజ్య చట్టాలు, మేధోసంపత్తి చట్టాలు, కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం చట్టం, ఇతర సమకాలీన చట్టాలను అధ్యయనం చేసేందుకు ఎక్స్‌లెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉందని వివరించారు.