Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టుల భర్తీకి తొమ్మిదిన ఇంటర్వ్యూ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లోని ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ కె.రమేశ్ రెడ్డి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ విడుదల చేశారు. 17 విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నెల తొమ్మిదిన ఆయా పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. 12న తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. విధుల్లో చేరేందుకు ఆఖరి గడువు డిసెంబర్ 19. పోస్టుల దరఖాస్తు, మార్గదర్శకాలను డీఎంఈ వెబ్సైట్లో చూడొచ్చు.