Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ఇందిరాపార్క్ వద్ద డీఎస్సీ-2008 అభ్యర్థుల వేడుకోలు సభ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'కేసీఆర్ సారు... కరుణించండి' పేరుతో డీఎస్సీ-2008 అభ్యర్థులు శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద వేడుకోలు సభ నిర్వహిస్తున్నారు. 13 ఏండ్ల గోస ఇప్పటికైనా తీరేనా?అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై 1,110 కుటుంబాలు ఆశలు పెట్టుకున్నాయని గురువారం ఒక ప్రకటనలో పలువురు అభ్యర్థులు తెలిపారు. తమకు న్యాయం చేస్తామంటూ 2016లోనే సీఎం కేసీఆర్ హామీనిచ్చారని గుర్తు చేశారు. సచివాలయానికి పిలిచి మరీ చర్చలు జరిపారని పేర్కొన్నారు. బాధితులకు ఉద్యోగాలివ్వాలంటూ తాజాగా హైకోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు. కేసీఆర్ హామీని, హైకోర్టు తీర్పును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బాధిత అభ్యర్థులు ఇప్పటికీ చిన్న చిన్న ఉద్యోగాలతో చాలీచాలని జీతాలతో బతుకీడుస్తున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల సాధన కోసం ధర్నాలు, ఆమరణ దీక్షలు, సచివాలయ ముట్టడి వంటి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. 1,100 మంది అభ్యర్థులు ఉద్యోగం వస్తుందన్న ఆశతో బతుకుతున్నారని వివరించారు. తమ గోడును ముఖ్యమంత్రి కేసీఆర్కు విన్నవించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు.