Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీహెచ్ డాక్టర్ శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హెచ్ఐవీ వ్యాధి రాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు సూచించారు. గురువారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, ఎన్జీవోలతో కలిసి హెచ్ఐవీ నివారణకు కృషి చేస్తున్నదని తెలిపారు. విద్యార్థులు, యువత ఈ కృషిలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీశాక్స్) ఏపీడీ డాక్టర్ అన్నప్రసన్నకుమారితో పాటు ఎన్జీవోల ప్రతినిధులు, హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వారు పాల్గొన్నారు. అంతకు ముందు బ్యానర్లు, ప్ల కార్డులతో ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు.