Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్తో భేటీ అనంతరం వైఎస్ షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
లా అండ్ ఆర్డర్ సమస్యను పుట్టించింది పోలీసులు, టీఆర్ఎస్ నేతలేనని వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు షర్మిల తెలిపారు. ఈ మేరకు గురువారం గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ను కలిసి పిర్యాదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజాప్రస్థానం పాదయాత్రను అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారనీ, ఫ్లెక్సీలు తగలబెట్టారని వాపోయారు. బస్సులు కాలబెట్టి, కార్యకర్తలను కొట్టారనీ, వాహనాలను ధ్వంసం చేశారని వివరించారు. పోలీసుల తీరుపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. బాల్కసుమన్, సునీత, కవితలు బెదిరిస్తే తును బెదిరే బిడ్డను కానని తెలిపారు. కేసీఆర్ పతనం మొదలైందని తెలిసే..దాడులు చేస్తున్నారని విమర్శించారు. పాదయాత్రకు వస్తున్న ఆదరణ భరించలేకపోతున్నారన్నారు. ప్రగతి భవన్లో దర్యాప్తు సంస్థలు సోదాలు చేయాలని కోరారు. కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకుందని విమర్శించారు. తనపై దాడి ఘటనకు సంబంధించి కేంద్ర హౌంశాఖకు, సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.