Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్ఆర్డీఏ
నవ తెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు (డీఎంఈ), తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో స్పెషలిస్టు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్ డీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కె.మహేశ్ కుమార్ వైద్యారోగ్యశాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీకి వినతిపత్రం అందజేశారు. డీఎంఈ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, టీవీవీపీ పరిధిలో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లతో పాటు డీఎంఈ విభాగంలో 13, టీవీవీపీలో 49 ఆప్తమాలజిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన హెల్త్ ప్రొఫైల్ ద్వారా గ్రామీణ ప్రజలు ఎక్కువగా హైపర్ టెన్షన్, డయాబెటీస్,హైపర్ కొలెస్టెరొలెమియా, అనీమియా, కిడ్నీ, థైరాయిడ్, కాలేయ సంబంధ వ్యాధులతో (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ - ఎన్సీడీ) బాధ పడుతున్నట్టు బయటపడిందని గుర్తుచేశారు.
గ్రామీణ ప్రజల వైద్యసేవల కోసమున్న టీవీవీపీలో మంజూరైన స్పెషలిస్టు పోస్టులు 4,030 కాగా అందులో 1,371 మంది పని చేస్తుండగా 2,659 ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అదే విధంగా మెడికల్ కాలేజీల్లో 1,100 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కాటారాక్ట్ ఏర్పడి కంటి చూపు దెబ్బ తినడానికి ఎన్సీడీ వ్యాధులు ముఖ్య కారణంగా మారుతున్నాయనీ, వీటి నివారణకు వెంటనే పోస్టుల భర్తీ చేపట్టాలని కోరారు.