Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శాయంపేట
అదనపు కట్నం తేవాలని అత్తింటి వారు వేధింపులకు గురి చేయడంతో వివాహిత పల్లబోయిన అనూష పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మరణించారు. ఎస్ఐ ఇమ్మడి వీరభద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. జోగంపల్లి గ్రామానికి చెందిన కౌటం ప్రభాకర్ చిన్న కుమార్తె అనుషను పరకాల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పల్లబోయిన ధర్మతేజతో ఏడు నెలల కిందట వివాహం జరిపించారు. వివాహ సమయంలో కట్న కానుకలు, ఇతర లాంఛనాలు ఇచ్చి ఘనంగా పెండ్లి చేశారు. నెల రోజులపాటు సంసారం సాఫీగానే కొనసాగగా.. తర్వాత నుంచి అనూష భర్త ధర్మతేజ, అత్త పల్లబోయిన అన్నపూర్ణ, మామ సాంబయ్య, ఆడబిడ్డలు రేవతి, గౌతమి, మరిది సుధీర్‌కుమార్.. ఈ ఆరుగురు వ్యక్తులు అదనపు కట్నం తేవాలని అనుషను మానసికంగా, శారీరకంగా వేధించేవారు. ఈ విషయంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరగగా అత్తింటి వారిని మందలిం చారు. అయినప్పటికీ వారిలో మార్పు రాకపోగా అదనపు కట్నం కోసం మరింతగా వేధిస్తుండటంతో ప్రభాకర్ తన కూతుర్ని రెండు నెలల కిందట స్వగ్రామానికి తీసుకువచ్చాడు. అయినప్పటికీ అత్తింటివారు అనూ షకు ఫోన్లు చేస్తూ వేధింపులకు గురి చేయడంతో మానసికంగా కృంగి పోయి గత నెల 22న సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నది. గమనించిన కుటుంబ సభ్యులు హనుమ కొండలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాగా చికిత్స పొందుతున్న అనూష గురువారం మరణించింది. అనుష తండ్రి ప్రభాకర్ ఫిర్యాదు మేరకు ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి పరకాల ఏసీపీ శివరామయ్య దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.