Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలి : ఈటల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇక్కడ దోపిడీ సరిపోదన్నట్టుగా ఢిల్లీకి పోయి లిక్కర్ వ్యాపారం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో రాష్ట్ర ప్రజలకు కవిత సమాధానం చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ధరణి పేరిట వేలాది ఎకరాల భూములను చరబట్టి, పేదల భూములను మాయం చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించారని విమర్శించారు. ఆ డబ్బులను తమలాంటి వారిని ఓడగొట్టడానికి వాడటం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 2014 వరకు అటుకులు బుక్కి ఉపాసముండి ఉద్యమాలు నడిపామని కేసీఆర్ చెప్పేవారని తెలిపారు. అలాంటి పార్టీకి ఎనిమిదేండ్ల కాలంలో వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కోరారు. ఏ పార్టీకి కూడా సొంత హెలికాప్టర్లు, విమానాలు లేవనీ, టీఆర్ఎస్కు దాన్ని కొనే స్తోమత ఎక్కడ నుంచి వచ్చిందని నిలదీశారు. ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు తాతజాగీర్ లాగా ఇక్కడ నుంచి వేలకోట్ల రూపాయలు పంపించి తెలంగాణ ప్రజల సొమ్మును ధారాదత్తం చేస్తుంది ఎవరు? అని ప్రశ్నించారు. తమ పార్టీ అకౌంట్లో అతి తక్కువ కాలంలోనే రూ.870 కోట్ల రూపాయల వైట్ మనీ ఉందని కేసీఆర్ చెప్పింది వాస్తవం కాదా? అని నిలదీశారు.