Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఆలస్యంగా వెలుగులోకి..
నవతెలంగాణ- నల్లగొండ
అధికారుల అలసత్వం, వైద్యాధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మహిళకు ఆపరేషన్ చేసి కాన్పు చేసిన డాక్టర్లు కడుపులో దూది పెట్టి కుట్లు వేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. రగత నెల 14న దేవరకొండ మండలం కొమ్మెపల్లికి చెందిన శిరీషను రెండో కాన్పు కోసం నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. 17న డాక్టర్లు ఆపరేషన్‌తో కాన్పు చేయగా పాప పుట్టింది. అప్పటి నుంచి శిరీషకు తీవ్ర రక్తస్రావం, జ్వరంతో బాదపడుతున్నా 24న డిశ్చార్జ్ చేశారు. శిరీషకు తరచూ కడుపునొప్పి వస్తుండటంతో కుటుంబ సభ్యులు బుధవారం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్ళారు. డాక్టర్ ఆమెకు స్కానింగ్ తీయగా కడుపులో దూది ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న శిరీష కుటుంబ సభ్యులు, బంధువులు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.