Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ శశికళగా మారారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్ట్‌లో ఆమె పేరు ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో కవిత మాట్లాడిన తీరుకు ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. కవిత అవినీతికి పాల్పడ్డారనీ, మద్యం కుంభకోణంలో ఆమె పేరును సిబీఐ ప్రస్తావించిందని తెలిపారు. లైగర్ సినిమా పెట్టుబడుల ద్వారా ఆమె అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. అయితే ఈ విషయంలో తెలంగాణ సెంటిమెంట్ తీసుకురావడం సరికాదని గుర్తు చేశారు. కల్వకుంట్ల కుటుంబ అవినీతిని ఆమోదించే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరని హెచ్చరించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టుల్లో నెలకొన్న అవినీతిపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.