Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశపరీక్షలను ఓయూ వీసీ ప్రొఫెసర్ రవిందర్ యాదవ్ గురువారం ప్రారంభించారు. పరీక్షల పాస్వర్డ్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదేండ్ల విరామం తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ప్రవేశాలు నిర్వహిస్తోందని తెలిపారు. పీహెచ్డీ అడ్మిషన్లలో కేటగిరీ సీట్లను ఈ ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నట్టు చెప్పారు. ఓయూలో ఆయా విభాగాల్లో పీహెచ్డీ ప్రవేశం కోసం 9, 976 మంది విద్యార్థులు పోటీ పడుతున్నట్టు తెలిపారు. అనివార్య కారణాలతో ఇన్ని ఏండ్లు పీహెచ్డీ ప్రవేశపరీక్ష నిర్వహించలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.పి. పి.లక్ష్మీనారాయణ, కన్వీనర్ ప్రొ.ఐ.పాండురంగారెడ్డి, కంట్రోలర్ ప్రొ. శ్రీనగేష్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ప్రొ.వర్ధిని పాల్గొన్నారు.