Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎర వేశారనే కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలు వేర్వురుగా వేసిన బెయిల్ పిటిషన్లను అనుమతిస్తూ న్యాయమూర్తి సీహెచ్ సుమలత గురువారం తీర్పు చెప్పారు. బెయిల్ మంజూరుకు పలు షరతులు విధిం చారు. రూ.3 లక్షల చొప్పున ముగ్గురు విడివిడిగా పూచీకత్తు సమర్పించా లని ఆమె ఆదేశించారు. అంతే మొత్తంతో రెండు ష్యూరిటీలు సమర్పిం చాలని ఆదేశించారు. సిట్ దర్యాప్తునకు సహకరించడమే కాకుండా సాక్ష్యాల ను తారుమారు చేసేందుకు ప్రయత్నించరాదని చెప్పారు. పాస్‌పోర్టులను సిట్‌కు అప్పగించాలనీ, దేశం విడిచి పారిపోకూడదనీ సూచించారు.
టీఎస్పీఎస్సీ సభ్యుల భర్తీపై కేసులో తీర్పు రిజర్వు
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సభ్యుల నియామకపు అమలును ప్రశ్నిస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డిల కూడిన డివిజన్ బెంచ్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకాలు చట్ట వ్యతిరేకంగా జరిగాయని పేర్కొంటూ ప్రొఫెసర్ ఎ.వినాయక్‌రెడ్డి పిల్ వేశారు.
ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును ధర్మాసనం వాయిదా వేసింది.