Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఈ స్టీమ్ పవర్, ఎన్జీఎస్ఎల్ వెల్లడి
హైదరాబాద్: ఎన్టీపీసీ రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్‌లోని 1, 3 యూనిట్లను ఆధునీకరించినట్టు జీఈ పవర్ ఇండియా లిమిటెడ్ (జీఈపీఐఎల్), ఎన్జీఎస్ఎల్ కన్సార్టియంలోని దాని అనుబంధ సంస్థలు తెలిపాయి. యూనిట్ 1, 3కి టర్బైన్ హీట్ రేట్లో సగటు 9.9 శాతం మెరుగుదల, టర్బైన్ జీవితకాలం 20 సంవత్సరాలు పొడిగింపు, రెండు యూనిట్ల థర్మల్ సామర్థ్యంలో సగటు ఫ్లస్ 3.8% పాయింట్ల మెరుగుదలకు స్టీమ్ టర్బైన్ అప్‌గ్రేడ్ ప్రాజెక్ట్ తోడ్పడిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అప్‌గ్రేడ్ చేయబడిన యూనిట్లు పవర్ ప్లాంట్ కోసం బొగ్గు వినియోగంలో సంవత్సరానికి 2.12 లక్షల మెట్రిక్ టన్ను సంభావ్య వార్షిక పొదుపునకు మద్దతును ఇవ్వనున్నాయి. ప్రాజెక్ట్ ప్రాంతానికి సంబంధించి 2.34 లక్షల మెట్రిక్ టన్ను/సంవత్సరానికి కార్బన్‌డైఆక్సైడ్‌ను ఉద్గారాలను తగ్గిస్తుంది. ఈ యూనిట్లు నికర జీరో 2070 ప్రభుత్వ లక్ష్యసాధనకు అనుగుణంగా ఉండనున్నాయని జీఈ పవర్ ఇండియా లిమిటెడ్ ఎండి ప్రశాంత్ జైన్ తెలిపారు.