Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కృతజ్ఞతలు తెలిపిన కల్లుగీత కార్మిక సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ లోని ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం(టీఎస్కేజీకేఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. దీని కోసం తక్షణం స్థల సేకరణ జరపాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు గురువారంనాడోక ప్రకటనలో అభినందనలు తెలిపారు. ఎన్నో ఏండ్లుగా తమ సంఘం ఈ డిమాండ్‌ను లేవనెత్తుతూ వచ్చిందని గుర్తుచేశారు. ఖిలాషాపురం టు గోల్కొండ కోటకు బస్సుయాత్ర, ఉప్పల్‌లో వేలాదిమందితో సర్వాయి పాపన్న సందేశ యాత్ర, బహిరంగ సభ, పాపన్న యాదిలో 10 యాత్రలు నిర్వహించినట్టు తెలిపారు.