Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కంటి వెలుగు రెండో దశ కార్యక్రమం జనవరి 18న ప్రారంభం కానున్న నేపథ్యంలో సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వనున్నట్టు సరోజినీదేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సరోజినీ దేవి కంటి ఆస్పత్రితో పాటు ఎల్.వీ.ప్రసాద్ నేత్రవైద్యశాలలో దాదాపు 1,500 మంది అప్తాల్మిక్ అసిస్టెంట్లు, ఆప్తోమెట్రిక్స్కు ఈ నెల మొదటి వారంలో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ శిక్షణ బ్యాచ్‌ల వారీగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రజలెవరూ కంటి సమస్యలతో బాధ పడొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిందని తెలిపారు. ప్రతి వారం శని, ఆదివారాలు మినహాయించి ఐదు రోజుల పాటు జరిగే కంటి పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా రాజలింగం పిలుపునిచ్చారు.