Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టర్ ఆవిష్కరించిన ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పీడీఎస్యూ రాష్ట్ర 22వ మహాసభలు ఈనెల ఏడు, ఎనిమిది తేదీల్లో హైదరాబాద్లో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన వాల్పోస్టర్ను ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి గురువారం హైదరాబాద్లో విడుదల చేశారు. అన్ని వర్గాల విద్యార్థులు పాల్గొని ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యారంగంలోని సమస్యలతోపాటు సమాజంలోని అంతరాలపై కొట్లాడాలని సూచించారు. కులం, మతం, స్త్రీ-పురుష వివక్షత, పేద, ధనికుల మధ్య అంతరాల్లేని సమాజం కోసం కృషి చేయాలని వివరించారు. విద్యార్థులు రాజకీయ చైతన్యంతోపాటు సామాజిక స్పృహ కలిగి ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ నాగేశ్వరరావు, బోయిన్పల్లి రాము, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక,్ష కార్యదర్శులు ఎస్ అనిల్, కె ప్రవీణ్, ఉపాధ్యక్షుడు ఎన్ సుమంత్, సహాయ కార్యదర్శి ఎస్ రాకేష్, నిజాం కళాశాల కమిటీ ఉపాధ్యక్షుడు తిరుపతి, నాయకులు హర్ష, కళ్యాణ్, ఎస్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.