Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో పిటీషన్ దాఖలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తన భార్యతో ఏసీబీ ఆఫీసర్లు అనుచితంగా ప్రవర్తించారని బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదని జల్పల్లి మాజీ మున్సిపల్ కమిషనర్ గాదె ప్రవీణ్‌కుమార్ వేసిన రిట్‌పై హైకోర్టు స్పందించింది. వివర ణతో కౌంటర్ దాఖలు చేయాలని ్ళోంశాఖ ముఖ్య కార్యదర్శి, బాలాపూర్ పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్, రాచకొండ సీపీ, డీసీజీ, ఏసీబీ ఏడీజీ, ఏసీబీ డైరెక్టర్లను హైకోర్టు ఆదేశించింది. విచారణను వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ విజరుసేన్‌రెడ్డి చెప్పారు. ఏసీబీ అధికారులు తన ఇంటిపై దాడి సమయంలో తన భార్య వివరణ కోరితే దూషించారని చెప్పారు. తన ఇంట్లోని వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని, దీనికి సీసీ ఫుటేజీ సహా అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఏసీబీ అధికారులు మీడియాకు చెప్పారని, ఆధారాలు చూపలేదన్నారు. విచారణ వాయిదా పడింది.
మంత్రి అండతో అక్రమణలు
బొక్కొనిగూడ, ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో చెరువులు, నాలాలు, కుంటల ఆక్రమణలను మంత్రి మల్లారెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఘట్క్సర్ మున్సిపల్ కౌన్సిలర్ సంగీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బఫర్, ఎఫ్టీఎల్ జోన్లలో ప్లాట్లు వేసుకోవడానికి రియల్టర్లు చట్ట విరుద్ధ చర్యలను, ఆక్రమణదారులను మంత్రి మల్లారెడ్డి ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. అనుమతి ఇప్పిస్తున్నారు. పైగా, ఆక్రమణలను క్రమబద్ధీకరించాలనీ, ఆక్రమణదారులను ఏమీ అనరాదని మంత్రి చెబుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. బొక్కొనిగూడ పరమేశ్వర్ నగర్ కాలనీలోని 238, 240, 241, 243 సర్వే నెంబర్లల్లోని బఫర్, శిఖం భూమిలోని ఆక్రమణలను తొలగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.ఇందులో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, సీఏడీ ఉన్నతాధికారులు, ఘట్కేసర్ మున్సిపల్ కమిషనర్, మేడ్చల్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్‌తో పాటు మంత్రి మల్లారెడ్డిని ప్రతివాదులుగా చేశారు.
సిట్ వద్దు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ చేయరాదని, సీబీఐకి ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ నేత జడ్జన్ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. ఇందులో సీఎంను కూడా ప్రతివాదిగా చేశారు. సిట్ దర్యాప్తునకు ముందే సీఎం మీడియా ద్వారా దర్యాప్తు ఎలా ఉండోలా చెప్పారన్నారు. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే దర్యాప్తును సీబీఐ కివ్వాలని కోరారు.