Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఎస్ఆర్టీసీలో సంక్షేమ మండళ్లను రద్దు చేసి కార్మిక సంఘాల కార్యకలాపాలకు అనుమతించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సంస్థలో కార్మిక సంఘాలను రద్దు చేయడం సమంజసం కాదని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీలో కార్మికులు చాలీచాలని వేతనాలతో అధిక పని ఒత్తిడితో పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్రంలో కూడా ఆర్టీసీ వంటి సంస్థలను కాపాడాలని కోరారు. ఫిట్మెంట్తో కూడిన వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
2020, జనవరి నుంచి రావాల్సిన ఆరు డీఏలను, రిటైర్డ్ అయిన, చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు లీవ్ ఎన్క్యాష్మెంట్ నగదు ఇవ్వాలని తెలిపారు. 2013 వేతన సవరణ బకాయిల బాండ్లకు సంబంధించిన డబ్బులు, సహకార సంఘాలకు ఉన్న బకాయి డబ్బులు చెల్లించాలని పేర్కొన్నారు. తక్షణమే కార్మిక సంఘాల కార్యకలాపాలను పునరుద్దరించాలనీ, వాటికి గుర్తింపు సంఘ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.