Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కడివెండి నుంచి ప్రారంభం..
- కేరళలోని త్రిసూర్ దాకా కొనసాగింపు
- పోస్టర్‌ను ఆవిష్కరించిన నేతలు
- జయప్రదానికి పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేరళలోని త్రిసూర్‌లో ఈనెల 13 నుంచి 16 వరకు అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) మహాసభలు కొనసాగనున్న నేపథ్యంలో... జనగామ జిల్లాలోని కడివెండి నుంచి రైతు అమరవీరుల జ్యోతి యాత్రను ప్రారంభిస్తామని ఏఐకేఎస్ నేతలు తెలిపారు. ఈనెల ఐదున ఆరంభం కానున్న ఈ యాత్ర త్రిసూర్ వరకూ కొనసాగుతుందని వారు వివరించారు. యాత్రను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి పిలుపునిచ్చారు. సంబంధిత వాల్ పోస్టర్‌ను ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మహాసభల నేపథ్యంలో దేశంలోని రెండు ప్రాంతాల నుంచి అమర వీరుల జ్యోతి యాత్రలను ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఇందులో ఒకటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య స్వగ్రామమైన కడవెండి నుంచి ఆరంభం కావటమనేది స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రస్తుత వ్యవసాయ రంగ దుస్థితి, దాని అనుబంధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతుల ఆత్మహత్యలు, వారి ఇబ్బందులు తదితరాంశాలపై మహాసభల్లో చర్చించి, కార్యాచరణను రూపొందిస్తామని వివరించారు. పోస్టర్ ఆవిష్కరణలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, పెసరకాయల జంగారెడ్డి, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యాత్ర షెడ్యూల్...
డిసెంబర్ 5న
- ఉదయం 10 గంటలు - కడివెండి గ్రామం (జనగాం జిల్లా)
- మధ్యాహ్నం ఒంటి గంట- రామన్నపేట (యాదాద్రి భువనగిరి జిల్లా)
- మధ్యాహ్నం రెండు గంటలు- గుండ్రాంపల్లి (నల్లగొండ జిల్లా)
- మధ్యాహ్నం 3.30 గంటలు -నల్లగొండ
- సాయంత్రం 5.30 గంటలకు మిర్యాలగూడ మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకుంటుంది.