Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పీఏతో పాటు మరో ఇద్దరి అరెస్ట్
- హనుమకొండలో కలకలం
నవతెలంగాణ-వరంగల్
లా విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడిన ఇద్దరు యువకులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణం హనుమకొండ జిల్లాలో చోటు చేసుకున్నది. విశ్వాసనీయ సమాచారం ప్రకారం సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని(23) హన్మకొండలోని ఓ కళాశాలలో ఎల్ఎల్బీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. తనపై ఇద్దరు యువకులు లైంగిక దాడి చేసారని బుధవారం హనుమకొండలోని పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపిన అనంతరం గురువారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు వరంగల్ ఎమ్మెల్యే పీఏ ఉండటం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే పీఏతో పాటు అతని స్నేహితులు, హాస్టల్ నిర్వాహకురాలిని పోలీసులు అరెస్టు చేశారని తెలుస్తోంది.