Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఆదాయపు పన్నుకు సంబంధించిన కేసులో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డిని శుక్రవారం రెండోసారి ఐటీ అధికారులు విచారించారు. అంతక ముందు భద్రారెడ్డిని విచారించిన ఐటీ అధికారులు అతను నిర్వహిస్తున్న కాలేజీలకు సంబంధించిన ఆర్థిక లావా దేవీలపై బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ఐటీ అధికారులు కోరారు. తమ దృష్టికి వచ్చిన ఆర్థిక వ్యత్యాసాలపై తమకున్న అను మానాలను నివృత్తి చేయటానికి భద్రారెడ్డి వద్ద ఉన్న సమాచారాన్ని కూడా ఇవ్వాలని ఆ సమయంలో కోరినట్టు తెలిసింది. దీనితో, ఆ వివరాలను తీసుకొని భద్రారెడ్డి రెం డోసారి ఐటీ అధికారుల ముందు హాజరైనట్టు సమా చారం. రెండోసారి కూడా భద్రారెడ్డిని సుదీర్ఘంగానే ఐటీ అధి కారులు విచారించారు. అంతేగాక, అవసరమైతే మరో సారి పిలుస్తామని చెప్పి భద్రారెడ్డిని పంపించినట్టు తెలిసింది.