Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరబాద్బ్యూరో
రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న బీసీ, ఓసీ ఉద్యోగుల సంక్షేమం, హక్కుల సాధన కోసం ఆయా సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఏర్పడింది. ఉద్యోగుల పదోన్నతుల్లో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలనీ, ప్రత్యక్ష నియామకాల్లో ఎంపికైన ఉద్యోగుల సీనియారిటీని తదుపరి ప్రమోషన్ల కోసం మెరిట్ ఆధారంగా నిర్ధారించాలనే డిమాండ్ల సాధన కోసం దీన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జేఏసీ చైర్మెన్ కోడెపాక కుమార స్వామి, కో చైర్మన్ ఆర్. సుధాకర్ రెడ్డి, కన్వీనర్ ముత్యం వెంకన్న గౌడ్, కోకన్వీనర్ సి.భాను ప్రకాష్, ఫైనాన్స్ సెక్రటరీ డాక్టర్ సిహెచ్. చంద్రుడు, జాయింట్ సెక్రెటరీలుగా జి బ్రహ్మేంద్ర రావు, ఎన్ .రాజేందర్, వి. కళాధర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పి.యాదగిరి, కే సంపత్ రెడ్డి, ఎం. విజయ కుమార్, జి.రాజేందర్ పబ్లిసిటీ సెక్రటరీలుగా ఎం. అశోక్ కుమార్, పి. విజయ కుమార్ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎం. ప్రేమ్ కుమార్, జి.వెంకట్రావు పి.అశోక్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.