Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏజీఎమ్లకు ఎమ్డీ శ్రీధర్ ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణిలో రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా, 16 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు చర్యలు చేపట్టాలని ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ ఏరియా జనరల్ మేనేజర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన సంస్థ డైరెక్టర్లు, సలహాదారులు, ఏరియాల జనరల్ మేనేజర్లతో ఉత్పత్తి లక్ష్యాల సాధనపై ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గరిష్ట స్థాయిలో ఉత్పత్తి సాధిస్తున్న మణుగూరు, ఇల్లందు, ఆర్జీ-1, ఆర్జీ-2 ఏరియాల కషిని ప్రశంసించారు. ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తిని సకాలంలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.విద్యుత్ వినియోగం పెరిగిన నేపథ్యంలో బొగ్గుకు డిమాండ్ క్రమంగా పెరుగుతున్నదనీ, ఉత్పత్తి అయిన బొగ్గును వినియోగదారులకు అందించడం కోసం తగినన్ని రేకులను సమకూర్చుకోవడానికి కోల్ మూమెంట్ శాఖ రైల్వే వారిని సమన్వయపరచుకోవాలని చెప్పారు. సమావేశంలో డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్, ఎన్. బలరామ్, డి. సత్యనారాయణ రావు, అడ్వైజర్ డి.ఎన్. ప్రసాద్ (మైనింగ్), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జె. ఆల్విన్ తదితరులు పాల్గొన్నారు.