Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీఫ్‌విప్‌పై టీఆర్ఎస్ నాయకురాలి ఆగ్రహం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
'గల్లీ నుండి ఢిల్లీ దాకా ఫైటింగ్ చేసినా.. నాది ఒక్క ఫొటో పెట్టలేదు.. వినరు భాస్కర్ నాశనమైపోతడు.. ఉద్యమంతో నా భర్త జాబ్ పోయింది.. నా కుటుంబం చిన్నాభిన్నమైంది. చీఫ్‌విప్ దాస్యం వినరుభాస్కర్ ఒక్క పోస్టు ఇయ్య లేదు.. కార్పొ రటర్ టికెట్ ఇవ్వలేదు.. దొంగల కిచ్చుకున్నడు.. నా కడుపు మీద కొడుతరా.. ఉద్యమంలో నేను పని చేసిన వాటి ఫొటోలేవీ..? ఒక ముస్లిం మహిళను పక్కనపెడు తున్నరు..' అంటూ టీఆర్ఎస్ నాయకురాలు రహీమున్నీసా బేగం కన్నీటి పర్యంతమయ్యారు. హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లోని టౌన్ హాలులో దీక్షా దివస్ సందర్భంగా ఫొటో ఎగ్జిబిషన్‌ను శుక్రవారం ఏర్పాటు చేశారు. ఆమె ఉద్యమంలో పాల్గొన్న ఒక్క ఫొటో కూడా పెట్టకపోవడంపై రహీ మున్నీసా బేగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయ డమే కాకుండా ఎగ్జిబిషన్లో ఫొటోలను చింపి వేసి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్యమంలో పాల్గొన్న తన ఫొటోలను ఒక్కటి కూడా పెట్టకపోవడాన్ని ఆమె ఖండించారు. కాగా రహీమున్నీసా వ్యవహారం టీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది.