Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీ చైర్మన్
హైదరాబాద్ : ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీ చైర్మెన్ ఠాగూర్ బాలాజీ సింగ్ అన్నారు. ఈ మేరకు నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలో సిరిసనగండ్ల రామాలయం ఆలయాన్ని సందర్శించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మతాలను సమానంగా చూస్తూ దేవాలయాల అభివద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం ఆలయ నిర్వహకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వెంకటయ్య యాదవ్, సర్పంచ్ యథం శీను, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోనుగోటి రవీందర్ రావు, రమేష్ గౌడ్, విష్ణు, మహేష్, భూపేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.