Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ ఉద్యమ కాలంలో వందలాది మంది విద్యార్థులు అమరులు కావడానికి కారణమైన ఆంధ్రా కుట్రదారుల సంతానం ఇవాళ అమరవీరులను స్మరించుకోవడం, స్థూపానికి నివాళులు అర్పించడం, ఉద్యమ కుటుంబంపై మకిలి జల్లడం అత్యంత హేయమైన చర్య అని టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు అన్నారు. శనివారం నాడాయన అమరవీరుల స్థూపాన్ని పసుపునీళ్లతో శుద్ధి చేసి పాలాభిషేకం చేశారు. అదే విధానం ఇంకా కొనసాగితే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అమరుల కుటుంబాలను ఆదుకున్నది, వారికి గుర్తింపునిచ్చింది కేవలం సీఎం కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. ఆయన తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు, అమరుల పట్ల అత్యంత నిబద్ధత కలిగిఉన్నారని అన్నారు. ఇవన్నీ గుర్తించకుండా అవాకులు చవాకులు పేలితే గతంలో మానుకోటలో జరిగిన సంఘటన పునరావతం అవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో శేషు, కష్ణ, బొల్లు నాగరాజు, జంగయ్య, మదన్, తరుణ్, సందీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.