Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తుల కోరిక మేరకు ఆలయ పూజ సేవలను విస్తరిస్తున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శనివారం అరణ్యభవన్‌లో ఆలయ సేవల విస్తరణ, ఆన్లైన్ సేవలు, కొత్తగా ధూప దీప నైవేద్య పథకం అమలు, దేవాదాయ శాఖ భూముల గెజిట్ నోటిఫికేషన్ తదితర అంశాలపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 74 ఆలయాల్లో డిసెంబర్ 10 నుంచి కొత్త సేవల్ని అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఆ వివరాలన్నీ దేవాదాయశాఖ వెబ్సైట్ వఅసశీషఎవఅ్ర.్ర.అఱష.ఱఅ లో భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ భూములకు పటిష్ట రక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆ భూముల వివరాలను చట్టబద్ధ రక్షణ కోసం గెజిట్‌లో పొందుపరుస్తున్నా మన్నారు. ఇప్పటికే గెజిట్‌లోకి సికింద్రాబాద్, మేడ్చల్ జిల్లా ఆలయ భూములు నమోదయ్యాయని వివరించారు. సికింద్రాబాద్ లో 1300 ఎకరాలు, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో 3 వేల ఎకరాల దేవాదాయ భూములను గెజిట్‌లో ముద్రించినట్టు తెలిపారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అదనపు కమిషనర్ క్రిష్ణవేణి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఎండోమెంట్ ల్యాండ్స్) రమాదేవి, సికింద్రాబాద్ అసిస్టెంట్ కమిషనర్ కష్ణ తదితరులు పాల్గొన్నారు.