Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కాంగ్రెస్ నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి కుమారుడు మర్రి పురువరెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీ తీర్ధం తీసుకున్నారు. ఆయనతో పాటు పలు పార్టీలకు చెందిన మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు కూడా చేరినట్టు తెలిపారు. బీజేపీలో చేరాక తొలిసారి మర్రి శశిధర్‌రెడ్డి తొలిసారి ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మర్రి శశిధర్‌రెడ్డ్డి కుటుంబ నేపథ్యం గొప్పదనీ, ఎన్నో ఉద్యమాలకు వారి తండ్రి చెన్నారెడ్డి నేతత్వం వహించారని చెప్పారు. ఆయన చేరికతో హైదరాబాద్‌లో బీజేపీ మరింత బలపడిందన్నారు.