Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాజన్నసిరిసిల్ల జిల్లాకు నవంబర్ నెలలో 4 స్టార్ కేటగిరీలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా మంత్రి కే తారకరామారావు హర్షంవ్యక్తం చేశారు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ధడ సంకల్పంతో అద్భుతాన్ని ఆవిష్కరించారంటూ వారందరినీ కొనియాడారు. గతాన్ని మార్చుకుని ఘనమైన వర్తమానాన్ని సొంతం చేసుకుంటున్న సిరిసిల్ల గడ్డ విజయ పరంపరలో తాజా అవార్డులు కూడా చేరాయంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనిపై సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పందిస్తూ 'మీ నిరంతర మార్గదర్శనం, సహకారం వల్లే సాధ్యమైంది' అంటూ రీ ట్వీట్ చేశారు.