Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాంచీ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఇతర కంపెనీలకు మళ్లించారని ఈడీ పెట్టిన కేసును కొట్టేయాలని ఎంపీ నామా నాగేశ్వర్‌రావు వేసిన రిట్‌ను శుక్రవారం హైకోర్టు విచారించింది. ఈడీ కేసుపై స్టే ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. ఈడీ కౌంటర్ దాఖలు చేశాకే మధ్యంతర ఉత్తర్వుల అంశంపై నిర్ణయం తీసుకుంటామని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శుక్రవారం ప్రకటించారు. ఈడీకి నోటీసు జారీ చేశారు. మధుకాన్, రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ కంపెనీలకు 13 ఏండ్ల క్రితమే నామా రాజీనామా చేశారని, రెండేండ్ల క్రితం సీబీఐ, ఈడీలు ఆ కంపెనీలతో సంబంధాలు ఉన్నట్లుగా కేసు నమోదు చేయడం చెల్లదని ఆయన న్యాయవాది వాదన. స్టే అవసరం లేదని ఈడీ వాదించింది. విచారణ 9కి వాయిదా పడింది.