Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఇందూ' శ్యాంప్రసాద్‌రెడ్డికి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వైఎస్ జగన్ ఆస్తులపై సీబీఐ నమోదు చేసిన చార్జిషీట్‌పై సీబీఐ కోర్టు విచారణకు ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి హాజరుకావాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. వ్యక్తిగత విచారణకు హాజరుకాకుండా మినహాయింపు కోరుతూ ఆయన దాఖలు చేసిన రిట్‌ను చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కొట్టేస్తూ శుక్రవారం తుది ఉత్తర్వులు జారీ చేశారు. ఏమైనా పనులుంటే సీబీఐ కోర్టు అనుమతి పొందవచ్చునని చెప్పారు. ఎస్‌పీఆర్ ప్రాపర్టీస్ ప్రయివేట్ లిమిటెడ్, భూమి రియల్ ఎస్టేట్స్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రయివేట్ లిమిటెడ్, ఇందూ టెక్ జోన్, ఇందూ ప్రాజెక్ట్స్ వేసిన రిట్లను కూడా కొట్టేశారు. అనంతపురం జిల్లా లేపాక్షిలో నాలెడ్జి హబ్ కోసం వైఎస్ సర్కార్ ఇచ్చిన సుమారు 9 వేల ఎకరాలపై రుణం తీసుకుని, వేరే కంపెనీలకు మళ్లించారనే సీబీఐ కేసులో ఆ కోర్టు విచారణకు హాజరుకావాలని చెప్పారు.