Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచంలో సంపూర్ణ మానవుడంటూ ఎవరూ లేడనీ, సమస్యలను అధిగమిస్తూ ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగడం ద్వారానే జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. 'ప్రపంచ వికలాంగుల దినోత్సవం' సందర్భంగా వికలాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మన్యూనతకు లోనుకాకుండా, ఆత్మస్థైర్యంతో లక్ష్యాలను సాధించాలని వారికి పిలుపునిచ్చారు. ఆసరా అవసరమైన వారికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నదనీ, వికలాంగుల సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. వారికి అందిస్తున్న సేవలపై అత్యుత్తమ రాష్ట్రంగా గుర్తించి కేంద్రం అవార్డులు అందించిన విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. వారి సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధను కనబరిచే ఉద్దేశంతో మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచివికలాంగుల శాఖను స్వతంత్ర విభాగంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు వికలాంగులకు రూ.500 ల పెన్షన్‌తో సరిపెడితే, స్వరాష్ట్రంలో ఒక కుటుంబంలో ఎంతమంది వికలాంగులుంటే అంతమందికి రూ.3,016 పెన్షన్‌ను అందిస్తూ వారిలో తమ ప్రభుత్వం ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తున్నదని తెలిపారు.