Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ యు న్కె టెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయుఎం అండ్‌హెచ్‌యూ) రాష్ట్ర మూడో మహాసభ ఆదివారం ఉదయం 11 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూపాల్, ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. వైద్యారోగ్యశాఖలో పని చేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్నట్టు వారు తెలిపారు. 102, 104, 108 ఉద్యోగులు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఆయుష్, వైద్య విద్య, వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు, ఆరోగ్య మిత్రాలు, నర్సింగ్ సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న కాంటింజెంట్ వర్కర్ల సమస్యలు, నేషనల్ హెల్త్ మిషన్, తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, ఆర్‌ఎన్‌టీపీసీ సమస్యలతో పాటు అన్ని స్కీమ్‌లలో పని చేస్తున్న ఉద్యోగుల డిమాండ్లపై కూలంకషంగా చర్చించి తీర్మానాలను ఆమోదిస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి భవిష్యత్‌లో నిర్వహించే దశల వారి ఆందోళన, పోరాటాల కార్యక్రమాలను రూపొందించుకోనున్నట్టు వివరించారు. ఈ మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా వైద్యారోగ్యశాఖలో పని చేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరు విచ్చేసి మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.