Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మినారాయణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ)లో చదువుకున్న విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని ఓయూ రిజిస్ట్రార్ పి లక్ష్మినారాయణ అన్నారు. తెలంగాణ యువతి మండలి స్కూల్ ఆఫ్ బిజినెస్ తొమ్మిదో స్నాతకోత్సవం శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థులకు బహుళజాతి సంస్థలు, కార్పొరేట్ సంస్థల్లో మార్కెట్, ఫైనాన్స్ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఎంబీఏ విభాగం ప్రొఫెసర్ డి శ్రీరాములు, తెలంగాణ యువతి మండలి స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రిన్సిపాల్ ప్రసన్న రేఖ, కరస్పాండెంట్ సునీల్‌కుమార్, కార్యదర్శి నివేదిత కుమార్ తదితరులు పాల్గొన్నారు.