Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదివాసీ,అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ
- మంత్రి సత్యవతిరాథోడ్‌కు వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గుత్తి కోయలపై పోలీసు, అటవీ అధికారులు దుర్మార్గమైన దుష్ప్రచారం చేస్తున్నారనీ, ఎర్రబోడు గ్రామం నుండి వారిని ఖాళీ చేయించాలనే ప్రయత్నంలో భాగంగా నోటీసులు జారీ చేయటాన్ని వెనక్కు తీసుకోవాలని ఆదివాసీ, అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ నేతలు శనివారం హైదరాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌కు వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుత్తి కోయలతో సహా, ఆదివాసులు ఇతర పారంపర్య భూములను సాగు చేసుకున్న వారకి వచ్చే ఆర్నెల్ల లోపు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గుత్తి కోయలు నివసిస్తున్న గ్రామాలనుండి వారిని పంపించకుండా చర్యలు తీసుకుంటామనీ, వారి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించామని తెలిపారు. వినతి పత్రం సమర్పించిన వారిలో కమిటీ కన్వీనర్ వేములపల్లి వెంకట్రామయ్యతో పాటు గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మానాయక్, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి మండల వెంకన్న, ప్రజాపంథా నాయకులు వి ప్రభాకర్, ప్రసాదన్న, తుకారం నాయక్‌లు ఉన్నారు.