Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో ప్రవేశించేందుకు వీలుగా ప్రపంచ ప్రముఖ లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ మూడుల్ ఎడ్యుకేషన్ టెక్‌కు సంబంధించిన అంకుర సంస్థ ఇ-అభ్యాస్‌ను స్వాధీనం చేసుకున్నది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు శుభాకాంక్షలు తెలిపారు. ఆన్‌లైన్‌లో లెర్నింగ్‌తో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందనీ, ఇప్పుడు పాటు మూడుల్ రాకతో డిజిటిల్ లెర్నింగ్‌లో అది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. మూడుల్ రాకతో భారతీయ వినియోగదారులు సైతం నేరుగా సేవలు పొందేందుకు వెసులుబాటు కలిగింది.
రాబోయే రెండేండ్లలో మూడుల్ సంస్థ నాలుగు వందల మందికి తీసుకోనున్నది. ఈ సందర్భంగా ఆ సంస్థ సీఎఫ్‌ఓ రోహాన్ హార్డీ, మెర్జర్స్ అండ్ అక్విజేషన్ హెడ్ నిక్ రేనాల్డ్స్ మాట్లాడుతూ, ఇటీవల యుఎస్‌ఏ ఫర్మ్స్‌ను స్వాధీనం చేసుకున్నామనీ, ఇండియన్ ఇ-అభ్యాస్‌తో ప్రపంచవ్యాప్తంగా మెరుగైన సేవలందించగలుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.వ్యవస్థాపక సిఇఓ మార్టిన్ డౌగియమస్ మాట్లాడుతూ భారత దేశంలో ఆన్‌లైన్ లెర్నింగ్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఇ-అభ్యాస్ సిఇఓ సుశీల్ మాట్లాడుతూ మూడుల్ సేవలను దేశవ్యాప్త ఇ-లెర్నింగ్ మార్కెట్‌లో పెంచేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.