Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేల కొనుగోలు కేసు...
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
సంచలనం రేపిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేరళకు చెందిన బీజేపీ నాయకుడు తుషార్, మరో డాక్టర్ జగ్గుస్వామిలకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి తమకున్న అనుమానాలు నివృత్తి చేయడానికి తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో సూచించింది. ఇప్పటికే జగ్గుస్వామి, తుషార్‌ల కోసం ఒకసారి నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు.. మరోవైపు లూకౌవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో మరో ఇద్దరు కేరళ వాసుల కోసం సిట్ గాలింపు చర్యలు చేపడుతున్నట్టు తెలిసింది.
నందుకు నాంపల్లి కోర్టు బెయిల్
ఇదిలావుంటే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడైన నందకుమార్‌పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కూడా మరో మూడు కేసులు నమోదైన విషయం తెలిసిందే. కాగా ఈ కేసుల్లో ఒకటైన తన యజమాన్యంలో లేని భూమిని మరో వ్యక్తికి లీజుకి ఇచ్చి రూ.70లక్షలు తీసుకున్నట్టు నంద కుమార్‌పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో నాంపల్లి కోర్టు నంద కుమార్‌కు శనివారం బెయిల్ మంజూరు చేసింది. కాగా ఇదే పోలీసు స్టేషన్‌లో మరో రెండు కేసులు కూడా ఉండడంతో బెయిల్‌పై నంద కుమార్ విడుదల కాలేదు.