Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు కార్మికులకు గాయాలు
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం సింగరేణి ఏరియా రుద్రంపూర్‌లోని పీవీకే-5 బొగ్గు గనిలో ప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులకు గాయాల య్యాయి. శనివారం గని లోపల మొదటి షిఫ్ట్ 11 గంటల ప్రాంతంలో 108 లెవల్‌లో ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్‌లో పని చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మైన్‌రూఫ్‌పై నుంచి పెద్ద బొగ్గు పెల్ల పడి ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. ఇందులో వెల్డర్‌గా పనిచేస్తున్న వినోద్ ఎడమ కాలు విరిగింది. జనరల్ మజ్దూర్ హెల్పర్‌గా పనిచేస్తున్న శంషుద్దీన్ గదవపై బొగ్గు పెల్ల పడి తీవ్రంగా గాయమైంది.
ప్రమాదం జరిగిన వెంటనే మైన్ అధికారులకు సమాచారం అందించి తోటి కార్మికులిందరినీ అంబులెన్స్‌లో కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన హాస్పిటల్‌కు తరలించారు. క్షతగాత్రులను మైన్ మేనేజర్ పి.శ్రీనివాసరావు ఆస్పత్రిలో పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్యులకు సూచించారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదం జరిగిన వెంటనే వివిధ కార్మిక సంఘాల నాయకులు ఆస్పత్రికి చేరుకొని వారి పరిస్థితి గురించి ఆరా తీశారు.