Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులు భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలి
- తెలంగాణ యూత్ డిమాండ్స్ డే సదస్సులో వక్తలు
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రమాదంలో పడిందని, విద్యార్థులు, యూత్ భవిష్యత్ పోరా టాలకు సిద్ధం కావాలని పలు వురు వక్తలు పిలుపునిచ్చారు. విద్యార్థి జన సమితి (వీజేఎస్), యువజన సమితి (వైజేఎస్) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఓయూ లైబ్రెరీ ఐసీఎస్‌ఎస్‌ఆర్ హాల్‌లో తెలంగాణ యూత్ డిమాండ్స్ డే సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్, ప్రొఫెసర్ హరగోపాల్ హాజరయ్యారు. అంతకు ముందు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిం చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ సమా జానికి ఎంతో మంది మేధావులను అందించిన ఓయూను నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోం దన్నారు. ఏ ఆకాంక్షల కోసం తెలం గాణని సాధించుకున్నామో, అవి నెరవేర లేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు యూనివర్సిటీలోకి పోలీ సులు వచ్చే పరిస్థితి ఉండేది కాదని, కానీ ప్రస్తుతం హాస్టల్‌లోకి కూడా పోలీసులు వస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 29 తేదీన శ్రీకాంత్ చారి గురించి మాట్లాడాలే తప్పా, కేసీఆర్ దీక్ష గురించి కాదన్నారు. ఆరేండ్లు అయిన అమర వీరుల స్థూపం పూర్తి కాలేదన్నారు. పేదలకు విద్యను అందించకుండా సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నా రన్నారు. అందులో భాగం గానే ప్రభుత్వ యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర పోస్టులు భర్తీ చేయడం లేదన్నారు. పోరాటాల ద్వారానే ప్రభుత్వ విద్యను సంరక్షణ చేయాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని చెప్పారు. అమరవీరుల స్ఫూర్తిగా విద్యార్థులు ఉద్యమిం చాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు, సీపీఐ (ఎంఎల్), న్యూడె మోక్రసీ నేత గోవర్ధన్, బైరి రమేష్, వైజేఎస్ అధ్యక్షుడు సలీం పాషా, వీజేఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సర్దార్ వినోద్ కుమార్,
స్టేట్ జనరల్ సెక్రటరీ మాసం పల్లి అరుణ్, యూత్ కో ఆర్డినేటర్ కొత్త రవి, స్టేట్ సెక్రటరీ పేరాల ప్రశాంత్, నరేందర్ నకిరేకంటి, జీవన్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, జీవన్, గోపి పాల్గొన్నారు.