Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ-కల్చరల్
వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖగా కొనసాగుతుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శనివారం ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంక్షేమంలో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పురోగమనలోకి తీసుకువెళుతున్నారని కితాబునిచ్చారు. భవిష్యత్తులో మరిన్ని ప్రణాళికలతో వికలాంగుల సంక్షేమ శాఖను ముందుకు తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వికలాంగులకు అమలు చేస్తున్న పథకాలు ఏ దేశంలో అమలు కావడం లేదన్నారు. 2016 నుంచి నేటి వరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో కలిసి ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖను మాతృ సంస్థలోకి మారుస్తున్నట్టు ప్రకటించారు. పీడబ్ల్యూడీ హెల్ప్‌లైన్ 155326తో పాటు 10 చేయూత వాహనాలను 33 జిల్లాలకు అందజేస్తామని చెప్పారు. వికలాంగులకు ఉపాధి కోసం ఎంప్లారుమెంట్ ఎక్స్‌చేంజ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం పలువురు వికలాంగులను సన్మానించారు. కార్యక్రమంలో దివ్య దేవరాజన్, డైరెక్టర్ శైలజ, వికలాంగుల సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మెన్ వాసుదేవ రెడ్డి, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.