Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునిత లక్ష్మారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మహబూబ్ నగర్ జిల్లా ఘటనలపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధి త అధికారులను ఆదేశించారు. ఉన్నత చదువుల కోసం థారు లాండ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విద్యార్థినిపై హెచ్‌సీయు ప్రొఫెసర్ లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన, మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ మండలంలో పదో తరగతి విద్యార్ధినిపై లైంగిక దాడి, హత్య ఘటనలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించిందని కమిషన్ కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్‌సీయు ఘటనపై సునిత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తల్లి, తండ్రి, గురువు.. ఆ తర్వాతే దైవం అంటారు.
అందుకే తల్లిదండ్రులు కూడా గురువులను నమ్మి ధైర్యంతో పిల్లలను పాఠశాల, కళాశాలకు పంపిస్తారన్నారు. కానీ.. విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువులు కొందరు తప్పుదోవ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ మండలంలో పదో తరగతి విద్యార్ధిని ఘటనలో తండ్రి వరసయ్యే వ్యక్తులే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడటం విచారణకరమన్నారు. మానవత్వం మంటకలిసిపోతుందనే దానికి ఈ ఘటనే తార్కానమని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మార్పుతో పాటు, కఠిన చర్యలు అమలు జరిగినప్పుడే ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట పడే అవకాశాలున్నాయన్నారు. బాధితులకు ప్రభుత్వం, రాష్ట్ర మహిళా కమిషన్ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.