Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్‌బీఐ హెడ్ బ్రాంచ్ జనరల్ మేనేజర్ మంజూ శర్మ
- ఎస్‌బీఐ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం
హైదరాబాద్ : వికలాంగులు తల్చుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని, అందరిలాగే వారు కూడా ఏదైనా సాధించగలరని, సవాళ్లను ఎదుర్కోగలరని, సమస్యలను పరిష్కరించగలరని, అభివృద్ధిలో భాగస్వాములు కాగలరని జనరల్ మేనేజర్ మంజు శర్మ అన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం హైదరాబాద్, కోఠిలోని ఎస్‌బీఐ లోకల్ మెయిన్ బ్రాంచ్‌లో వికలాంగులైన బ్యాంక్ సిబ్బందికి కస్టమర్లు, బ్యాంక్ సిబ్బంది ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఎస్‌బీఐ సిబ్బందిని సత్కరించిన స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫౌండేషన్ వారు ప్రత్యేకించి వికలాంగుల కోసం పనిచేయడం అభినంద నీయమన్నారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ అండ్ సీడీఓ జితేందర్ కుమార్ మాట్లాడుతూ.. ఎస్‌బీఐలో ఉన్న వికలాంగులైన సిబ్బంది ఎంతో మంచిగా, సమర్థవంతంగా పనిచేస్తున్నారని, వారిని చూసి తానే ఆశ్చర్య పడుతుంటానని తెలిపారు. కార్యక్రమంలో ఏజీఎం (హ్యూమన్ రిసోర్స్), ఏజీఆర్ (లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్), ఏజీఎం (మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్), ఏజీఎం (బ్యాంకింగ్ అంబుజ్డ్‌మెన్), లిజన్ ఆఫీసర్ (పిడబ్ల్యుడి) తదితరులు పాల్గొన్నారు.