Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ అసిస్టివ్ టెక్నాలజీ ప్రదర్శన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రత్యేక అవసరాలు కలిగిన వారితోపాటు పెద్దలు, గాయపడిన వారు, వికలాంగుల కోసం తెలంగా ణ అసిస్టివ్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ ముందుకు తెచ్చింది. ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్‌ఐసీ ఫౌండేషన్), మహిళా, శిశు సంక్షేమశాఖ, విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ టీ-హబ్‌లో తెలంగాణ అసిస్టివ్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ మూడో సారి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్-టీవీసీసీ చైర్మెన్ వాసుదేవ రెడ్డి, వికలాంగులశాఖ కమిషనర్ బి.శైలజ తదితర ప్రముఖులు ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ భవిష్యత్తులో నూతన ఆవిష్కరణలు చాలా అవసరమని తెలి పారు. వికలాంగులు జీవితాలను మరింత మెరుగ్గా సాగించేందుకు ఇవి ఉప యోగపడతాయని తెలిపారు. దీర్ఘకాలం పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిం చేందుకు వికలాంగుల సామర్థ్యం, జీవన ప్రమాణాలను ఈ ఆవిష్కరణలు పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంకుర సంస్థలు, ఆవిష్కర్తలు, జాతీయ సంస్థలు, బీవీఆర్‌ఐటీ నుంచి విద్యార్థులకు చెందిన 39 ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఐసీ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత తౌతమ్ తదితరులు పాల్గొన్నారు.