Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పద్మశ్రీ అవార్డు గ్రహీత సాయిబాబాగౌడ్
హైదరాబాద్ : వికలాంగుల్లోనూ గొప్ప సామర్థ్యం, నైపుణ్యం ఉంటుందని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, దేవనార్ ఫౌండేషన్ చైర్మెన్ సాయిబాబా గౌడ్ అన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ జోనల్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జోనల్ మేనేజర్ మక్సూద్ అలీ సమక్షంలో వికలాంగ సిబ్బందిని ఘనంగా సత్కరించారు. దేవనార్ ఫౌండేషన్ చైర్మెన్ సాయి బాబా గౌడ్ దృష్టిలోపం ఉన్నవారికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ.. వికలాంగులు దేనికీ తక్కువ కాదని, వారిలో గొప్ప సామర్థ్యం, నైపుణ్యం ఉంటుందని తెలిపారు. వికలాంగులకైనా, దృష్టిలోపం ఉన్నవారికైనా చదువుకున్నప్పుడే అపారమైన అవకాశాలు, గుర్తింపు లభిస్తుందన్నారు.