Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బేల
నవతెలంగాణ ఆదిలాబాద్ రీజియన్ మేనేజర్ కొలిపాక నాందేవ్ తండ్రి చిన్నన్న ఆనారోగ్యంతో గత నెల 29న మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలోని ఆయన స్వగ్రామం బేల మండలం సాంగిడిలో దశ దిన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్, జీఎంలు ఎ.వెంకటేష్, టి.శశిధర్, పి.నరేందర్ రెడ్డి, ఎడిటోరియల్ బోర్డు సభ్యులు ఎన్.అజరు కుమార్ హాజరై చిన్నన్న చిత్ర పటానికి నివాళ్లు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పరామర్శించిన వారిలో.. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్, కార్యదర్శివర్గ సభ్యులు లంకా రాఘవులు, బండి దత్తాత్రి, డెస్క్ ఇంఛార్జి రాపర్తి దత్తాత్రి, స్టాఫర్ మెడపట్ల సురేష్, నిజామాబాద్ మేనేజర్ సురేష్, సిబ్బంది సురేష్, గోపి, విలేకరులు పాల్గొన్నారు.