Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేతలకు షబ్బీర్ అలీ ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రధాని మోడీ హయంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పాలని మాజీ మంత్రి షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవ్న్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మోడీని విమర్శిస్తున్న కేసీఆర్ మాత్రం చేస్తున్నదేమిటి? అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను కేసీఆర్ ఎందుకు తగ్గించట్లేదని నిలదీశారు. స్వాతంత్య్ర పోరాటం, తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర ఉందా? అని ప్రశ్నించారు. ఈడీ విచారణకు సోనియా, రాహుల్ హాజరయ్యారని గుర్తు చేశారు. బీజేపీ నేత బీఎల్ సంతోష్ సిట్ విచారణకు ఎందుకు హాజరు కావడం లేదన్నారు. సోనియా, రాహుల్ కంటే బీఎల్ సంతోష్ గొప్పవారా? అని షబ్బీర్‌అలీ ప్రశ్నించారు.