Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న థారులాండ్కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడికి పాల్పడటాన్ని ఐద్వా రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఆదివారం ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు లక్ష్మి ఒక ప్రకటన విడుదల చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా చదువు నేర్పే విద్యాలయాల్లో ఉన్నత చదువులు, చదువుతున్న వారికి కూడా వేధింపులు తప్పడం లేదని పేర్కొన్నారు. పుస్తకం కోసం బయటికి పిలిచి ప్రొఫెసర్ ఇలా ప్రవర్తించడం దేశానికే అవమానకరమని తెలిపారు. పాఠశాలల్లో తోటి విద్యార్థులు, లైంగిక దాడులకు పాల్పడటం, సౌత్ కొరియా యువతిపై ఇలాంటి ఘటనే జరగడం, కర్ణాటక పాఠశాలల్లో పిల్లల బ్యాగుల్లో కండోమ్స్, మద్యం దొరకడం వంటి ఘటనలతో సమాజం ఏమైపోతుం దనే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో మన దేశ ప్రతిష్ట దిగజారి పోయేలా జరుగుతున్న ఈ ఘటనలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలనీ, దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
బాలికపై లైంగికదాడి, హత్యకేసులో దోషులను కఠినంగా శిక్షించాలి
మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలంలో పదోతరగతి బాలికపై బాబాయి వరుసైన వ్యక్తి మరో ఇద్దరితో కలిసి లైంగిక దాడికి పాల్పడి, చంపేయడం దారుణమని పేర్కొన్నారు. భేటీ బచావో-భేటీ పడావో అనే నినాదం ఏమైందని మోడీ సర్కారును విమర్శించారు. బాలికపై లైంగికదాడి చేసి ఆమె మృతికి కారణమైన వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.