Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు
నవతెలంగాణ - సిరిసిల్ల
కార్మికుల హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు విమర్శించారు. సీఐటీయూ రాజన్న సిరిసిల్ల జిల్లా మూడో మహాసభలు పట్టణంలోని లహరి ఫంక్షన్ హాల్ (కారంగుల వినోద్‌రావు ప్రాంగణం)లో ఆదివారం ప్రారంభమయ్యాయి. ముందుగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి వందలాదిమంది కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి ఆధ్యక్షతన నిర్వహించిన సభలో సాయిబాబు కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. సీఐటీయూ 52 సంవత్సరాలుగా దేశంలో ఆర్థిక, సామాజిక సమస్యలపై రాజీలేని పోరాటాల నిర్వహిస్తున్నదన్నారు. సిరిసిల్ల జిల్లాలో కార్మికుల హక్కుల పోరాటాల చాంపియన్‌గా పోరాడుతుందని చెప్పారు. రానున్న రోజుల్లో కార్మిక శక్తి దేశ, రాష్ట్ర పాలకులకు తెలిసేలా సమిష్టి ఉద్యమాలకు కలిసిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రమ, కూరపాటి రమేష్, మూషం రమేష్, జిల్లా కార్యదర్శి రమణ, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.